Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే! (2024)

Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!

PublishedThu, Jan 26 2023 12:40 PM

Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే! (1)

ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అతి దీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందింది. దీని రచనను పూర్తి చేయడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రభుత్వ సంస్థల విధులను గుర్తించేలా నిర్దేశించింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులనూ నిర్దేశించింది.

రాజ్యాంగమే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేది. అదే ప్రభుత్వం, పౌరుల మధ్య... నమ్మకం, సమన్వయాన్ని సృష్టిస్తుంది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడం భారత పౌరుని ప్రాథమిక విధుల్లో ఒకటి. అప్పుడే సార్వభౌమ గణతంత్ర సభ్యునిగా, భారతదేశంలోని ప్రతి పౌరుడూ ప్రతిరోజూ వినియోగించుకోవలసిన రాజ్యాంగ హక్కులను పొందుతాడు. ప్రతి పౌరుడి అభివృద్ధి అతని హక్కులు, విధులపై అతనికి ఉన్న అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది.

ఏ దేశ రాజ్యాంగం అయినా దేశ ప్రగతి కోసం మంచి పాలన, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇవ్వాలి. మన రాజ్యాంగం ప్రకారం జరిగిన ఈ 72 సంవత్సరాల పాలనా కాలంలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాం. తయారీ రంగంలో 30వ ర్యాంకులో ఉన్నాం. ఇక వివిధ ఆహార ధాన్యాల, తృణధాన్యాల ఉత్పత్తిలో మనం మొదటి 5 స్థానాన్ని ఆక్రమించాం.

కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం 20 శాతం పేదరికంలోనే ఉన్నాం. 12 శాతం నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. విపరీతమైన ఆదాయ అసమానతలూ ఉన్నాయి. వివిధ ప్రపంచ సూచికలలో మనం ఆందోళనకరమైన స్థానాల్లో ఉన్నాం. ఉదాహరణకు ఉగ్రవాద సూచికలో 8వ స్థానం, అవినీతిలో 28వ ర్యాంక్, హ్యాపీ ఇండెక్స్‌లో 44 ర్యాంక్‌లో ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం – రెండింటి కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు చాలానే ఉన్నా ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే విధానాలు ఉత్తమమైనవే కానీ వాటి అమలులో మాత్రం లోపాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అధిగమించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు వంటి ఇటీవలి విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన సృష్టించాయి. అయితే ఈ సమస్యలన్నీ తగిన రాజ్యాంగ సవరణలతో పరిష్కరించబడతాయి. సానుకూల ఫలితాలను, సమాజ అభ్యున్నతికి హామీ ఇచ్చే విధానాలను సులభంగా స్థాపించగలిగే విధంగా మన చట్టాలను సవరించడం కొనసాగించాలి.

రాజ్యాంగాన్ని సముచితంగా అమలు చేయడానికి రాజకీయ రంగంలో, కార్యనిర్వాహక యంత్రాంగంలో నైతిక విలువలు ఉండాలి. ప్రజలు అవసరమైన చోట ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రతి పౌరుడూ ఇతరుల హక్కులను గౌరవించాలి. చట్టబద్ధంగా, నైతికంగా తన విధులను నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ సారాన్నిఆస్వాదించగలరు. (క్లిక్ చేయండి:సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్‌)

– డాక్టర్‌ పి.ఎస్‌. చారి, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నిపుణులు

# Tag

Republic Day 2023India ConstitutionalIndiademocracyopinion

Related News by category

  • సాధారణ బోగీల సంఖ్య పెంచాలి జనగామ: ప్రతీ రైలులో సాధారణ బోగీల సంఖ్యను పెంచాలని ఐదు సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్‌ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం పవన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదు సాధారణ బోగీల కోసం ప్రధానమంత్రికి దేశ వ్యాప్తంగా కోటి ఉత్తరాలను పంపించడమే లక్ష్యమన్నారు. గాంధీ మార్గంలో ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ రోజు దేశ వ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది రైలు ప్రయాణం చేస్తున్నారన్నారు. ఈ ప్రయాణంలో జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఆగమ్యగోచరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బండి శంకర్‌ బాబు, బొద్దుల శ్రీధర్‌,చంద్రశేఖర్‌, ఆలేటి శ్రీను, హనుమాన్ల రవి, దండెం రవి , వెంకటరమణ్‌, సయ్యద్‌, యాకయ్య, వెంకటేశ్వర్లు, బాలనర్సయ్య, విశ్వనాధుల రాజు, భిక్షపతి, నరేష్‌ పాల్గొన్నారు.బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలిజఫర్‌గఢ్‌: సీఎం హామీ మేరకు ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర స్టడి సర్కిల్‌ సభ్యుడు మంగు జయప్రకాశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా పదోన్నతులు ఆరేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. అక్టోబర్‌లో బదిలీ అ యిన స్కూల్‌ అసిస్టెంట్స్‌ అందరినీ రిలీవ్‌ చేసి నూతన పాఠశాలలకు పంపించాలన్నారు. గిరి జన సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాలసదన్‌ను సందర్శించిన జడ్జిజనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని బాల సదన్‌ (చిల్ట్రన్‌ హోం)ను ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఇ.సుచరిత బుధవారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జి అక్కడకు వెళ్లి పిల్లల కష్టసుఖా లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చదు వు ఎలా సాగుతుంది, నాణ్యతా ప్రమాణాలతో కూడిన భోజనం అందిస్తున్నారా, పిల్లల ఆరో గ్యం తదితర వాటిపై ఆరా తీశారు. పిల్లలు ప్రతీ రోజు 8 గ్లాసుల మంచి నీటిని తాగాలని సూచించారు. జడ్జి వెంట లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ న్యాయవాది ఇట్టబోయిన జ్యోత్స్న, తదితరులు ఉన్నారు.నిబంధనలు విస్మరిస్తే చర్యలుదేవరుప్పుల: వ్యవసాయ సాగు రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయాల్లో నిబంధనలు విస్మరిస్తే సదరు యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు పరుశరామ్‌నాయక్‌ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విత్తనాలు, ఎరువులు స్టాక్‌ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతుల మేరకు నిర్ధేశిత కంపెనీ ఎరువులు మాత్రమే విక్రయించాలని, కాలపరిమితి ముగిసిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు విక్రయించరాదన్నారు. నకిలీ విత్తనాల ముఠాపై కఠిన చర్యలు తీసుకునేందుకు దుకాణాదారులు తోడ్పాటు అందించాలన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కరించాలిజనగామ: విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్‌, ఆర్జిజన్స్‌, సెక్యురిటీ గార్డ్స్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీ ఐటీయు) జనగామ సర్కిల్‌ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్‌ఈ వేణుమాదవ్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భగవాన్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీను, శ్రీకాంత్‌, బత్తిని ఆంజనేయులు, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
  • పనుల్లో నాణ్యత పాటించాలి జనగామ: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్తీ యూపీఎస్‌, ఉర్దూ మీడియం యూపీఎస్‌ పాఠశాలలు, జనగామ మండలం శామీర్‌పేట, ఎల్లంల జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రాథమిక, ఉన్నత బాణాపురం పీఎస్‌ పాఠశాలల్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో విద్యుత్‌ బల్బులు, ఫ్యాన్లు, ఇతర మరమ్మతు పనులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. తాగు నీటి సిస్టర్న్‌, వాష్‌ ఏరియా ప్లాట్‌ ఫాం, ట్యాప్‌లను తనిఖీ చేసి, నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 291 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 93 పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు సుందరీకరణ పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఈఓ రాము, డీఆర్డీఓ మొగులప్ప తదితరులు ఉన్నారు.ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలిరఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. బుధవారం మండలంలోని అశ్వరావుపల్లి, వెల్ది గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ధాన్యం తరలింపు, తేమ శాతం తదితర వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలకు గాను 185 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు 24,559 మంది రైతుల నుంచి 1,25,163,360 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, 23,413 మంది రైతులకు రూ. 256.18 కోట్లు చెల్లించామన్నారు. కలెక్టర్‌ వెంట డీసీఎస్‌ఓ రోజారాణి, డీఎం, డీఆర్డీఓ మొగులప్ప, డీఎం సీఎస్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ పురం యుగేందర్‌, డీటీ సీఎస్‌ శ్రీనివాస్‌, సీసీ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా
  • జనగామ శంకర్‌దాదాలు జనగామ: అర్హత లేని వైద్యం చేస్తూ రోగుల పాలిట శాపంగా మారుతున్నారు. తప్పుడు హోదాలతో అమాయక ప్రజలను మోసం చేస్తూ... నిబంధనలకు విరుద్ధంగా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాలోలాగా పట్టణంలో కూడా అర్హత లేని వైద్యులు దర్జాగా స్టెతస్కోప్‌ వేసుకుని ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. స్పెషలిస్టు హోదా లేకున్నా... బోర్డులపై పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాస్తూ... అర్హత లేని వ్యక్తులు రిపోర్టులు ఇచ్చేస్తున్నారు. కొంత మంది కక్కుర్తి అధికారుల అండదండలతో ప్రైవేట్‌ వైద్యంలో నకిలీ డాక్టర్లదే హవా కొనసాగుతుంది. నెలనెల ‘మామూళ్లు’ గానే డూప్లికేట్‌ వైద్యానికి సహకారం అందిస్తూ... గాలిలో కలిసి పోతున్న అమాయకుల ప్రాణాలకు కారకులవుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ.. వేలకు వేలు దండుకుంటూ... ప్రెగ్నెన్సీ పరీక్షలు అంగట్లో సరుకులా మార్చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యం దందాను పెకిలించేందుకు తెలంగాణ వైద్య మండలి బృందం దూకుడు పెంచింది. ఆకస్మిక దాడులతో నకిలీ వైద్యం చేస్తున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తూ... కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అమాయక ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల భరతం పట్టేందుకు రాష్ట్ర వైద్యమండలి టాస్క్‌ఫోర్స్‌ టీం సభ్యులు ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, సర్టిఫై లేని ఆస్పత్రులు, ఎముకల వైద్యశాలలు, డయాగ్నోస్టిక్‌, ఫిజియోథెరపీ తదితర సెంటర్లను తెలంగాణ వైద్య మండలి టాస్క్‌ ఫోర్స్‌ టీం బృందం వరుస దాడులతో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న హాస్పిటల్స్‌ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైద్యమండలి టాస్క్‌ఫోర్స్‌ టీం సభ్యులు డాక్టర్‌ మాగంటి శేషుమాదవ్‌, డాక్టర్‌ వద్ది రాజు రాకేష్‌, డాక్టర్‌ వేములపల్లి నరేష్‌, డాక్టర్‌ కొలిపాక వెంకటస్వామి, డాక్టర్‌ జలగం విజయ్‌, డాక్టర్‌ ఎండీ అన్వర్‌, డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ షాబాజ్‌ నేతృత్వంలో ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గుట్టుచప్పుడు కాకుండా గర్భిణీ, హెచ్‌ఐవీ పరీక్షలు, ల్యాబ్‌కు సంబంధించి అర్హత లేని వ్యక్తులచే సర్టిఫికేషన్‌, తప్పుడు హోదాలు, అనర్హత చాటున స్పెషలిస్టు పేరిట వైద్యం అందిస్తూ తెలంగాణ వైద్యమండలిలో టాస్క్‌ ఫోర్స్‌ టీంకు అడ్డంగా దొరికేశారు. నకిలీ వైద్యం కేసులో ఐపీసీ సెక్షన్లువేషధారణ ద్వారా మోసం చేసిన కేసులో (416), మోసం చేసిన శిక్షలో (417, 419), చీటింగ్‌ (418), నకిలీ వైద్యంతో నిజమని నమ్మించడం (471), తదితర వాటికి సంబంధించి ఐపీఎస్‌ సెక్షన్ల పరంగా కేసులు నమోదు చేస్తామని టాస్క్‌ ఫోర్స్‌ టీం సభ్యులు తెలిపారు.అర్హత లేని డాక్టర్లు.. అనవసర వైద్యం ఎంబీబీఎస్‌తో పాటు ఎండీగా బోర్డులు ఎవర్‌ గ్రీన్‌ ఆస్పత్రిలో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్లు విద్యార్హత లేకున్నా.. ఎముకల స్పెషలిస్ట్‌ వైద్యం పలువురిపై కేసు నమోదు తెలంగాణ వైద్య మండలి విజిలెన్స్‌కు నివేదికలుఅర్హత లేకున్నా..వైద్య పట్టా లేకుండా ఎవరూ చికిత్స చేయొద్దు. పారామెడికల్‌ కోర్సు పూర్తి చేసిన వారు, ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి. ఎలాంటి అర్హత లేకున్నా, పేరుకు ముందు డాక్టర్‌ అని బోర్డు తగిలించుకుని ఇంజెక్షన్లు ఇవ్వడం, గ్లూకోస్‌ ఎక్కించడం విరుద్ధం. క్వాలిఫైడ్‌ డాక్టర్‌ రాసిన ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే మెడికల్‌ దుకాణాల్లో మందులు ఇవ్వాలి. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ వైద్య మండలికి వచ్చిన ఫిర్యాదులతో పాటు రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తుంది. వైద్య పరంగా ఎటువంటి విద్యార్హత లేకుండా, ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్‌ చీటి లేకుండా మందులు ఇస్తే, దానిపై ఉన్న బ్యాచ్‌ నంబర్‌తో పట్టేస్తాం. – డాక్టర్‌ జలగం విజయ్‌, తెలంగాణ వైద్య మండలి టీం సభ్యుడు
  • జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలి రఘునాథపల్లి: రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత పుట్టిన గడ్డ జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మైలారం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని కోమల్లలో ఆయన రజక సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి ఐలమ్మ వర్థంతిని అధికారికంగా జరపడంతో పాటు జిల్లాకు పేరు పెట్టాలన్నారు. రజకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఐలయ్య, శ్రీనివాస్‌, భిక్షపతి, రామ్మూర్తి, సంపత్‌, వెంకటనర్సు, చంద్రయ్య, సత్యనారాయణ, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.
  • ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం వద్దు జనగామ: జనగామ పట్టణంలో ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం చేయరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌ కోరారు. ఇటీవల సాక్షిలో ప్రచురిత మైన గాడితప్పిన టౌన్‌ ప్లానింగ్‌ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఏసీ స్పదించారు. కమిషనర్‌ చాంబర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమునలింగయ్య, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, 2వ వార్డు కౌన్సిలర్‌ వాంకుడోతు అనిత, తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటి నిర్మాణ అను మతులకు సంబంధించి 41 ఫైళ్లలో 50 శాతం మేర ఎంక్వరీ పూర్తి చేసి, నివేదిక అందించాలని టీపీఎస్‌ ప్రశాంతిని ఆదేశించారు. సేవల విషయంలో మున్సిపల్‌కు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఎన్‌క్రోచ్‌మెంట్‌కు సంబంధించి రిపోర్టు అందించాలన్నారు. మెడికల్‌ లీవ్‌పై వెళ్లిన టీపీఓ శ్రీధర్‌కు ఫోన్‌ చేసి విధులకు రావాలని అడుగగా, యశోద ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఆస్పత్రి రిపోర్టులను తనకు పంపించాలని ఏసీ ఆదేశించారు. పట్టణంలో వీధి బల్బుల కాంట్రాక్టు పూర్తి కావడం, అవి సరిగా వెలగక పోవడంతో చీకటి మయంగా ఉందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఏసీ దృష్టికి తీసుకు వచ్చారు. ఇంజనీరింగ్‌ సెక్షన్‌లో డీఈ, ఇన్‌చార్జ్‌ ఏఈ, టీపీఓ, ఆర్‌ఐ, రెగ్యులర్‌ శానిటేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ లేకపోవడంతో పరి పాలన కుంటు బడి పోతుందన్నారు. అలాగే చీటకోడూరు ఫిల్టర్‌ బెడ్‌ నుంచి సరఫరా చేసే తాగునీరు పచ్చకలర్‌లో వస్తుందని, నాణ్యతా ప్రమాణాలతో నీటిని ఫిల్టర్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ అనిత చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి సెంట్రల్‌ లైటింగ్‌ మరమ్మతు చేపట్టండి యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌పై సమీక్ష

Advertisem*nt

Republic Day: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే! (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Melvina Ondricka

Last Updated:

Views: 6051

Rating: 4.8 / 5 (68 voted)

Reviews: 91% of readers found this page helpful

Author information

Name: Melvina Ondricka

Birthday: 2000-12-23

Address: Suite 382 139 Shaniqua Locks, Paulaborough, UT 90498

Phone: +636383657021

Job: Dynamic Government Specialist

Hobby: Kite flying, Watching movies, Knitting, Model building, Reading, Wood carving, Paintball

Introduction: My name is Melvina Ondricka, I am a helpful, fancy, friendly, innocent, outstanding, courageous, thoughtful person who loves writing and wants to share my knowledge and understanding with you.